ప్రముఖ సినీ, టీవీ నటి ఆత్మహత్య..!!

వాస్తవం ప్రతినిధి: ముంబైలో టీవీ నటుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. సినీ, టీవీ నటి అనుపమ పాథక్ దహిసర్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. అనుపమ పలు సినిమాలల్లో సైడ్ క్యారెక్టర్లలో మరియు సీరియళ్లలో ప్రధాన పాత్రల్లో నటించి మంచి పేరు సంపాదించింది. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్ గా ఉండేది. బీహార్‌లోని పూర్నియా జిల్లాకు చెందిన అనుపమ నటన నిమిత్తం ముంబైలో ఉంటుంది. ఆమె మరణానికి ఒకరోజు ముందు ఫేస్ బుక్ లో చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ లోకంలో ఎవరిని నమ్మవద్దని,ప్రజలు స్వార్దపరులని పేర్కొంది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.