అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఎన్నారైలు మృతి..!

వాస్తవం ప్రతినిధి: యూఎస్‌ఏ లోని న్యూయార్క్‌ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో భార‌త సంత‌తి మ‌హిళ‌, ఆమె ఇద్ద‌రు పిల్ల‌లు మృతి చెందారు. మ‌రో ఐదుగురు కుటుంబ స‌భ్యులు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. న్యూయార్క్ స్టేట్ హైవేపై సోమ‌వారం ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని బ్రోంక్స్‌లో నివాస‌ముండే గ‌యాప‌ర్స‌ద్ కుటుంబం రెండు కార్ల‌లో ట్రినిడాడ్, గయానా వెళ్లి వ‌స్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మొద‌టి కారును వేగంగా వ‌చ్చిన మ‌రో వాహ‌నం బ‌లంగా ఢీకొట్టింది. దీంతో అందులో ప్ర‌యాణిస్తున్న వారు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. సమాచరం అందుకున్న పోలీసులు హూటాహుటిన సంఘటన స్దలానికి చేరుకుని.. గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం బ్లూమింగ్టన్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.