ఏపీలో కొత్త స్ట్రాటజీ వేసిన బిజెపి..!!

వాస్తవం ప్రతినిధి: ఏపీలో కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో బిజెపి పార్టీ సౌండ్ డబుల్, త్రిబుల్ గా వినబడుతుంది. అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎంట్రీ ఇవ్వడం తో… ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని టార్గెట్ చేసుకుని మీడియా సమావేశాలలో ఛానల్ డిబేట్ లలో ఏకిపారేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో బిజెపి కి ఒక ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా లేకపోయినా…. ఈ స్థాయిలో బీజేపీ రాణించడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి బిజెపి రెడీ అయినట్లు మేధావులు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఏపీలో బీజేపీ సరికొత్త స్ట్రాటజీ వేసిందని అంటున్నారు. ఇటీవల మోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామమందిర పునాదిరాయి పడింది. కచ్చితంగా ఆ మందిరం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తవుతుంది. దీంతో రామమందిర సెంటిమెంట్ తో దేశవ్యాప్తంగా బీజేపీ విజయోత్సవాలను జరపటం గ్యారెంటీ అనే టాక్ వినపడుతోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో హిందూ ఎజెండాతో బిజెపి కొన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యిందని, అది ఇటీవల ఏపీలో సోము వీర్రాజు చిరంజీవితో భేటీ అవ్వటం బట్టి అర్థమవుతుంది అంటూ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఓటు బ్యాంకు పరంగా దళితులు ఎక్కువగా వైసిపి పార్టీ కే మద్దతు తెలుపుతున్న తరుణంలో మిగతా ఓటు బ్యాంకు ని తమవైపు ఆకర్షించే రీతిలో ఏపీలో బీజేపీ అధిష్టానం సరికొత్త స్ట్రాటజీ వేసినట్లు మేధావులు అంటున్నారు.