కే‌టి‌ఆర్ ని ముఖ్యమంత్రి చేయడం కోసం కే‌సి‌ఆర్ అతిపెద్ద త్యాగం ?

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాజకీయాలలో ఎప్పటి నుండో కేటీఆర్ ని కేసిఆర్ ఎప్పుడు సీఎం చేస్తారు అన్న చర్చ జరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సమయంలో కూడా ఈ చర్చ తెలంగాణ రాజకీయాలలో విపరీతంగా జరిగింది. ఆ సమయంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తారని, కొడుకు కేటీఆర్ తెలంగాణ రాజకీయాలలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా గెలిస్తే ముఖ్యమంత్రి గా రాణిస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత యధావిధిగా కేసీఆర్ ముఖ్యమంత్రి కాగా కేటీఆర్ మంత్రిగా రాణిస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్త సచివాలయం పూర్తిగా కేటీఆర్ జాతకానికి అనుగుణంగా అదృష్టం కలిసి వచ్చే విధంగా కేసిఆర్ నిర్మిస్తున్నారని టీఆర్ఎస్ శ్రేణుల్లో టాక్ వినపడుతోంది. సచివాలయం పూర్తయిన వెంటనే సీఎంగా కేటీఆర్ కి కేసిఆర్ పదవి బాధ్యతలు అప్పజెప్పడం గ్యారెంటీ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ ని ముఖ్యమంత్రి గా చేసే అతి పెద్ద వ్యూహంలో భాగమే కొత్త సచివాలయం ఏర్పాటు అనే టాక్ తెలంగాణ రాజకీయాలలో గట్టిగా వినబడుతోంది. రాష్ట్రానికి సంబంధించి పూర్తి బాధ్యతలు కేటీఆర్ చేతిలో పెట్టి…రాబోయే సార్వత్రిక ఎన్నికలకు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు తోడ్పాటుతో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పనున్నరని సమాచారం. ఇప్పటికే కేసిఆర్ దక్షిణాది రాజకీయాలలో కొంతమంది కీలక నేతలతోపాటు ఉత్తరాదిలో మమతాబెనర్జీతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం మంతనాలు జరుపుతున్నట్లు టాక్.