మహిళల టీ20 క్రికెట్ కోసం ఎదురుచూస్తున్నా: హర్మన్ ప్రీత్ కౌర్

వాస్తవం ప్రతినిధి: యూఏఈ వేదికగా జరగబోయే మహిళల టీ20 చాలెంజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని ఇండియా ఉమెన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పింది. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరిగే టైమ్ లో మూడు జట్లతో ఉమెన్స్ టీ20 చాలెంజ్ నిర్వహిస్తామని లీగ్​ గవర్నింగ్​ కౌన్సిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో టీ20 చాలెంజ్ కోసం ఎదురు చూస్తున్నానని హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పింది. ఇదివరకు ఎప్పుడూ దుబాయ్ లో మేము ఆడలేదు. అక్కడి వికెట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉందని ప్రీత్ కౌర్ తెలిపారు. ప్లేయర్లంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే పురుషుల ఐపీఎల్ మాదిరిగా మహిళల ఐపీఎల్ ను కూడా త్వరలోనే చూస్తాం అని హర్మన్ ప్రీత్ చెప్పుకొచ్చింది.