త‌నపై వ‌స్తున్న పుకార్ల‌ను ఖండించిన బ్రియ‌న్ లారా

వాస్తవం ప్రతినిధి: క‌రోనా పాజిటివ్ అని త‌నపై వ‌స్తున్న పుకార్ల‌ను వెస్టిండీస్ మాజీ క్రికెట‌ర్ బ్రియ‌న్ లారా ఖండించారు. తాను క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, నెగెటివ్ వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించారు. క‌రోనా పాజిటివ్ అని త‌న గురించి ప్ర‌చార‌మ‌వుతున్న అస‌త్య వార్త‌ల‌ను చ‌దివాన‌ని, వాస్త‌వాల‌ను వెల్ల‌డించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనాతో బాధ‌ను అనుభ‌విస్తున్న స‌మాజంలో ఇలాంటి అస‌త్య వార్త‌ల‌ను ప్ర‌చారం చేసి, భ‌యాందోళ‌న‌ల‌ను వ్యాప్తిచేయ‌డం మంచిదికాద‌ని తెలిపారు. ఇలాంటి పుకార్ల‌ వల్ల త‌న చుట్టూ ఉన్న‌వారు చాలా అందోళన చెందారని లారా తెలిపారు.