జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌‌గా మనోజ్ సిన్హా‌ నియామకం!

వాస్తవం ప్రతినిధి: జమ్మూకాశ్మీర్ నూతన గవర్నర్ ను మియమిస్తూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జరీ చేసారు. నూతన లెఫ్టినెంట్ గవర్నర్ గా మ‌నోజ్ సిన్హా నియమితులయ్యారు.

లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము రాజీనామాను ఆమోదించినట్టు ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ పేర్కొంది. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ నియామకంపై అధికారిక ఉత్తర్వులను వెలువరించింది. మనోజ్ సిన్హా‌ను లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం వేశారని, ముర్ము స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి అమల్లోకి వస్తుందని అన్నారు.

జ‌మ్మూ క‌శ్మీర్ తొలి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ గిరీష్ చంద్ర ముర్ము రాజీనామా చేయడంతో.. ఆ స్థానంలో మనోజ్ సిన్హా నియమితులయ్యారు. ఈ వారంలో పదవీ విరమణ చేయనున్న కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్‌) రాజీవ్‌ మెహెర్షి స్థానంలోకి ముర్మును తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

జమ్మూ కశ్మీర్ ను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించిన తర్వాత అక్టోబర్ 31, 2019లో ఆ రాష్ట్ర తొలి గవర్నర్ గా ముర్ము నియ‌మి‌తు‌ల‌య్యారు. ముర్ము గుజరాత్ కేడర్‌లోని 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రధాన కార్యదర్శిగా ముర్ము ప‌నిచేశారు.

బెనారస్ హిందూ యూనివర్సిటీలో విద్యార్ధి సంఘం నేతగా ఎదిగిన మనోజ్ సిన్హా అనంతరం బీజేపీలో చేరి మూడు సార్లు ఎంపీగా గెలిచారు. మోదీ మంత్రివర్గంలో రైల్వే శాఖ సహాయమంత్రిగా కూడ పనిచేసారు.మనోజ్ సిన్హా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు అత్యంత నమ్మకస్థుడని ఎలాంటి వివాదాల్లోకి పేరుంది. మరిన్ని వార్తలు చదవండి.