విజిట్ వీసాల‌పై యూఏఈ రావొద్దు: భారత రాయబారి

వాస్తవం ప్రతినిధి: ట్రావెల్ ప్రోటోకాల్‌పై స్పష్టత వచ్చేవరకు భారత పౌరులకు విజిట్ వీసాలపై ప్రయాణించడానికి అనుమతి లేదని యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ అన్నారు. అలాగే విజిట్‌ వీసాలపై ప్రయాణించడానికి పౌరుల‌ను అనుమతించాలా? వద్దా? అని భారత ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు” అని ఆయ‌న చెప్పారు. మ‌రోవైపు జూలై 29 నుంచి భారతదేశంతో సహా మరిన్ని దేశాలకు దుబాయ్ విజిట్ వీసాలు ఇవ్వడం ప్రారంభించిందని స‌మాచారం. అయితే, ఇండియాలో ఇప్పటికీ అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణాల‌పై ఈ నెల 31 వ‌ర‌కు ఆంక్ష‌లు ఉన్న‌ విష‌యం తెలిసిందే. దీంతో విజిట్ వీసాదారులు యూఏఈకి ఎలా వెళ్తారో స్పష్టత‌ లేదు. అదేవిధంగా ఉద్యోగస్దులు కూడా మ‌రికొంత కాలం వేచి చూడ‌టం మంచిద‌ని భార‌త రాయ‌బారి సూచించారు.