సింగపూర్‌ జడ్జిగా భార‌తీయుడు !

వాస్తవం ప్రతినిధి: భారతదేశ ఘనత అన్ని దేశాలలో విస్తరిస్తోంది. భారత సంతతికి చెందిన ఎందరో ప్రముఖులు అనేక దేశాలలో ముఖ్యమైన విభాగాలలో పైస్థాయి ఉద్యోగస్తులుగా చేస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన జ్యుడిషియల్‌ కమిషనర్‌, మేథో సంపత్తి హక్కుల నిపుణుడు దెదార్‌సింగ్‌ గిల్‌ సోమవారం సింగపూర్‌ సిటీ-స్టేట్‌ హైకోర్టు జడ్జిగా ప్రమాణంచేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆయ‌న ఈ ప‌ద‌వికి నియ‌మితులయ్యారు. తాజాగా గిల్ చేత‌ అధ్యక్షుడు హలీమా యాకోబ్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. దేదార్ సింగ్ గిల్ ప్రస్తుత వయసు ఉ 61 ఏళ్ళు.. ఆయన 2018లో సుప్రీంకోర్టు బెంచ్ లో జాయిన్ అయ్యారు. అంత‌కుముందు ఆయ‌న డ్రూ, నేపియర్‌లో మేధో సంపత్తి విభాగం ఎండీగా ప‌ని చేశారు.