హెచ్‌–1బీ వీసా దారులకు భారీ షాక్‌ ఇచ్చిన డొనాల్డ్‌ ట్రంప్!

వాస్తవం ప్రతినిధి: హెచ్‌1 బీ వీసాదారులకు అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ మరోషాక్‌ ఇచ్చారు. కరోనాతో తమ దేశ ప్రజలకు ఉద్యోగాల పరంగా ఇబ్బందులు రాకుండా ఉండేదుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హెచ్1 బీ లపై ట్రంప్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా.. హెచ్1బీ వీసాలో ఉన్నవారిని నియమించే ఫెడరల్ ఎజెన్సీలపై ట్రంప్ ఫోకస్ చేశారు. ఇక నుంచి హెచ్1 వీసాదారులకు నియామకం కల్పించే అవకాశం.. ఫెడరల్ ఏజెన్సీలకు లేకుండా సంతకం చేశారు. దీని ద్వారా ముఖ్యంగా హెచ్‌–1బీ వీసాలో ఉన్న వారిని కంపెనీ నియమించకోకూడదు. దీంతో యూఎస్‌ జాబ్‌ మార్కెట్‌పై ఆశలు పెట్టుకున్న మన ఐటీ నిపుణులకు ఇది పెద్ద దెబ్బ కానుంది. వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ కార్మికుల కోసం కష్టపడి పనిచేసే తమ దేశ పౌరులను తొలగించే నిర్ణయాలను తాను ఒప్పుకోబోనని తెలిపారు. అధిక జీతాలు తీసుకునే నిపుణుల కోసం మాత్రమే హెచ్‌-1బీ వీసాలను వినియోగించాలని, అంతేగానీ, తక్కువ జీతాలకు పనిచేసే వారిని కాదని చెప్పారు.