ధోనీ ఆ విషయాన్ని ముందే చెప్పాడు: యువీ

వాస్తవం ప్రతినిధి: చాలా కాలం ముందే నా క్రికెట్ భవిష్యత్తుపై ధోనీ స్పష్టతనిచ్చాడు. 2019 ప్రపంచకప్ కోసం సెలెక్టర్లు నన్ను పరిగణనలోకి తీసుకోరని మహీ కెప్టెన్​గా ఉన్నప్పుడే చెప్పాడు యువరాజ్ సింగ్ చెప్పాడు. 2003, 2007, 2011 వన్డే ప్రపంచకప్​ల్లో యువీ బరిలోకి దిగాడు. 2011 విశ్వటోర్నీలో ఆల్​రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి భారత్​ విజేతగా నిలువడంలో కీలపాత్ర పోషించాడు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలతో క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. నేను టీమ్​ఇండియాలో పునరాగమనం చేసినప్పుడు విరాట్​ కోహ్లీ బాగా మద్దతినిచ్చాడు అని యువీ చెప్పాడు. ఆ తర్వాత 2019 ప్రపంచకప్​ కోసం సెలెక్టర్లు నా పేరును పరిశీలించట్లేదని ధోనీ తెలిపాడని యువరాజ్ అన్నాడు.