మోడీ చేతిలోని 2024 ఎన్నికల ఆయుధం .. ఇక ఆపేది ఎవరు?

వాస్తవం ప్రతినిధి: 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయాన్ని నమోదు చేసుకున్న ప్రధాని మోడీ, రాబోయే 2024 ఎన్నికలలో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా అయోధ్య రామమందిరం సెంటిమెంట్ ని బాగా వాడుకోవడానికి బిజెపి ఇప్పటి నుండే కార్యాచరణ సిద్ధం చేసినట్లు సమాచారం. అయోధ్యలో రామమందిర నిర్మాణం దశాబ్దాల హిందువుల కల. ఈనెల 5వ తేదీ ప్రధాని మోడీ చేతుల మీదగా అయోధ్యలో రామమందిర శంకుస్థాపన పూజ జరగనుంది. దాదాపు అరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్ల అంచనా వ్యయంతో మందిరం నిర్మాణం కానుంది. దేశవ్యాప్తంగా రామభక్తుల విరాళాలతో ఈ ఆలయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం కానుంది.

ఇదిలా ఉండగా మందిరం నిర్మాణం సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు పూర్తయ్యేలా ప్లాన్ చేసి…. మందిరం పూర్తయిన వెంటనే దేశవ్యాప్తంగా మోడీ రామమందిర విజయ యాత్ర అనే సంచలన కార్యక్రమాన్ని చేపట్టాలని, ఈ విధంగా దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల ఓట్లు కొల్లగొట్టాలని, మరొక సారి అధికారంలోకి రావాలని మోడీ అయోధ్యలో రామమందిరాన్ని వచ్చే ఎన్నికలకు భారీ ఆయుధంగా వాడుకోవాలనే ఆలోచనలో ప్లాన్ చేసినట్లు సమాచారం.