భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలచిపోయే రోజు అదే..!!

వాస్తవం ప్రతినిధి: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమయం కేవలం మరికొన్ని రోజుల్లోనే రాబోతుంది. భారతదేశం చరిత్రలో ఆగస్ట్ 5 చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఆగస్టు 5 న అయోధ్య లో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ చేయబోతున్నారు.తాజాగా ఈ వ్యవహారం పై ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ..అయోధ్యలో రామమందిరం నిర్మిస్తాం అని మేము ఎప్పుడో చెప్పామని ..వాటిని ఇప్పుడు ఆచరణలో పెట్టి చూపించాం అని చెప్పారు.

అయోధ్యలో అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మిస్తామని చెప్పామని… ఆ మాటను నిలబెట్టుకున్నామని అలాగే ఆర్టికల్ 370 రద్దు ట్రిపుల్ తలాక్ లను రద్దు చేశామని చెప్పారు. అలాగే దేశంలో అభివృద్ధి పనులతో ముందుకుపోతున్నట్టు తెలిపారు. ఇక ఇప్పటితో రామ మందిర ఉద్యమం ముగిసిందని త్వరలోనే అక్కడ పూజలు కూడా ప్రారంభమవుతాయని అన్నారు . అలాగే మా తదుపరి లక్ష్యం మథుర వారణాసి దేవాలయాలే అంటూ సంచలన ప్రకటన చేశారు. ఆ రెండు దేవాలయాల గురించి కూడా న్యాయపోరాటం చేసి గెలుస్తామని చెప్పారు.