కొత్త లుక్‌ తో అదరగొడుతున్న సీఎస్‌కే కెప్టెన్‌

వాస్తవం ప్రతినిధి: కొద్దిరోజుల్లో ఐపీల్‌ ప్రారంభమవుతున్న వేళ సీఎస్‌కే కెప్టెన్‌ ధోనీ న్యూలుక్‌తో అదరగొడుతున్నాడు. తల వెంట్రుకలను ట్రిమ్‌ చేసుకుని మ్యాన్లీగా కనిపిస్తున్న ధోనీ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జూలై 2019 నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోనీ 14 నెలల తర్వాత ఐపీఎల్‌లో మెరువనున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ శిక్షణా శిబిరాలను యూఏఈలో నిర్వహించనున్నాయి. ఈ నెల రెండోవారంలో సీఎస్‌కే యూఏఈ చేరకుంటుందని జట్టు అధికారులు ధ్రువీకరించారు.