కరోనాతో యూపీ మంత్రి మృతి

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తొంది.. అది ఎవ్వరినీ వదలడంలేదు. దాని కోరలకు చిక్కి మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే దేశంలో పలువురు రాజకీయ నాయకులు కరోనా సోకి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ మంత్రి కమల రాణి మృతిచెందారు. 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆమె కరోనా టెస్టులు చేయించుకోగా జూలై 18న ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె అప్పటి నుంచి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుంది. ఆదివారం ఉదయం ఆమె మృతిచెందింది.