యుపి ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం!

వాస్తవం ప్రతినిధి: యుపి ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకొన్నారు.భారీగా జరిమానాలు విధిస్తేనే పౌరుల్లో బాధ్యత పెరుగుతుందని భద్రతా నిబంధనల్ని మరింత కఠినతరం భావించిన యోగీ సర్కార్ అందుకు అనుగునంగా ఆదేశాలు జారీ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం రోడ్డు భద్రతా నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే వాహనదారులకు రూ.10 వేలు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మోటారు వాహనాల చట్టం ప్రకారం గత ఏడాదిగా మద్యం మత్తులో డ్రైవ్‌ చేసినా, అంబులెన్స్‌లకు దారి ఇవ్వకపోయినా చోదకుల నుంచి 10 వేల రూపాయల వరకు జరిమానా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మొబైల్‌ మాట్లాడటం కూడా అందులో చేరింది.

ఇప్పటికే ట్రాపిక్ నిబంధనల పట్ల జాగరూకత, రోడ్‌పై ఎలా మెలగాలి అనే అంశాలపై అవగాహన కలగడానికి అనేక కఠినమైన నిబంధనలను అధికారులు విధించేవాళ్లు. సీటు బెల్ట్ పెట్టకపోవడం, తాగి డ్రైవ్ చేయడం, శరవేగంతో ప్రయాణించడం, రెడ్ లైట్లను జంప్ చేయడం, ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం వంటి వాటికి భారీ జరిమానాలు విధించేవారు. ఇప్పుడు సెల్లోమాట్లాడితే కూడా బాదడం మొదలైంది.