ఏపీలో కరోనా విలయ తాండవం!

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తోంది… గత మూడు రోజుల నుండి నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆంధోళన రేకెత్తిస్తోంది… ఏ రోజు కారోజు రికార్డు బ్రేక్ చేస్తూ నేడు కొత్తగా 10376 కేసులు నమోదయ్యాయి… దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య లక్షా 40 వేల 933 కు చేరింది… రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజు 68 మంది కరోనా కాటు కు బలయ్యారు..

అన్ లాక్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 1 నుండి అనేక సడలింపులు ఇచ్చింది.. మరో వైపున కరోనా వైరస్ క్షణం క్షణం .. భయం భయం అంటూ ప్రజల్ని భయకంపితులను చేస్తోంది… నాలుగునెలలకు పైగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా మాత్రం కట్టడి కావడంలేదు. కరోనా కేసులు తగ్గుతాయనుకుంటుంటే అమాంతం పెరుగుతున్నాయి… గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61 వేయి 699 టెస్టులను పరీక్షించగా 10376 మందికి కరోనా నిర్దారణైంది… వరుసగా మూడు రోజులనుండి రోజుకు పదివేల పైనే కోవిడ్ భాదితులవుతున్నారు.. ఇవాళ ఒక్కరోజు 68 మరణాలు సంభవించగా 3822 మంది నేడు డిశ్చార్జి అయ్యారు.. ఇప్పటి వరకు 19 లక్షల 51 వేయి 776 మందికి కరోనా టెస్టు లు చేయగా 1 లక్షా 40 వేల 933 మంది కి కరోనా సోకింది.. వీరిలో 63864 మంది చికిత్సపొంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.. ఇంకా వివిధ ఆసుపత్రులు, ఐసోలేషన్ లో 75720 మంది ఉన్నట్లు వైద్యఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. విదేశాలనుండి , ఇతర రాష్ట్రాల నుండి వచ్చి కరోనా భారిన పడినవారంతా కోలుకున్నారు..వారిలో ఎలాంటి మరణాలు సంభవించకపోవడం కొసమెరుపు..

ఇక అత్యధికంగా కరోనా వైరస్ భారిన పడుతున్న జాబితాలో అనంతపురం, తూర్పు గోదావరి, కర్నూలు , పశ్చిమగోదావరి, గుంటూరు , చిత్తూరు , విశాఖ జిల్లాలున్నాయి.. ఆయా జిల్లాల్లో కేసులు ఐదంకెలు దాటాయి అంటే పదివేల పైబడి 20 వేలలోపు కేసులు నమోదయ్యాయి…. అత్యల్పంగా పదివేల కు లోబడి కరోనా కేసులున్న జిల్లాలుగా శ్రీకాకుళం, విజయనగరం , ప్రకాశం , నెల్లూరు , కడప, క్రిష్ణా జిల్లాలున్నాయి.