ఇంద్రకీలాద్రి పై వరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ

వాస్తవం ప్రతినిధి: పవిత్ర శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి ఫై వేంచేసి ఉన్న దుర్గమ్మ వరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్బంగా మహిళలు భక్తి శ్రద్దలతో లక్ష్మిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. బెజవాడ ఇంద్రకీలాద్రి ఫై వేంచేసి ఉన్న దుర్గమ్మ వరలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ సన్నిధిలో ప్రతి ఏటా సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే …కరోనా నేపధ్యంలో అధికారులు సాముహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ సారి దేవస్థానం అధికారులే వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు . అయితే భక్తులకు పరోక్ష పూజల ద్వారా గోత్రనామాలతో జరిపేందుకు మాత్రం అవకాశం కల్పించారు. వరలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూండగా….కొవిడ్ నేపధ్యంలో ఆలయ అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.