వియత్నాంలో నమోదైన తొలి కరోనా మరణం

వాస్తవం ప్రతినిధి: కరోనా కట్టడి విషయంలో ప్రపంచ దేశాలకు పాఠం నేర్పిన వియత్నాంలో తొలి కరోనా మరణం నమోదైంది. డానాంగ్‌లో ఇటీవల ఓ 70 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వియత్నాం వెల్లడించింది. దీంతో డానాంగ్‌ ప్రాంతంలో కరోనా కేసులు నమోదవుతుండటంతో.. పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికమని అధికారులు తెలిపారు. వియత్నాంలో ఇప్పటివరకు 509 మంది కరోనా బారినపడ్డారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అమెరికా లాంటి అగ్రరాజ్యాలే విఫలమైన వేళ.. చిన్న దేశం వియత్నాం ప్రత్యేక చర్యలతో అద్భుతం చేసింది.