సొంత నావిగేషన్ వ్యవస్థను ప్రారం‌భిం‌చిన చైనా

వాస్తవం ప్రతినిధి: చైనా తన సొంత నావి‌గే‌షన్‌ వ్యవస్థ ‘బీ‌డో’ను విజ‌య‌వం‌తంగా అభి‌వృద్ధి చేసింది. చైనా అధ్య‌క్షుడు ఈ వ్యవ‌స్థను అధి‌కా‌రి‌కంగా ప్రారం‌భిం‌చారు. అమె‌రి‌కాకు చెందిన గ్లోబల్‌ పొజి‌ష‌నింగ్‌ సిస్ట‌మ్‌‌కు(‌జీ‌పీ‌ఎస్‌) పోటీగా చైనా బీడోను అభి‌వృద్ధి చేసింది. అమె‌రి‌కాకు చెందిన గ్లోబల్‌ పొజి‌ష‌నింగ్‌ సిస్ట‌మ్‌‌కు(‌జీ‌పీ‌ఎస్‌) పోటీగా చైనా బీడోను అభి‌వృద్ధి చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రి‌క్త‌తల నేప‌థ్యంలో చైనా తన సొంత నావి‌గే‌షన్‌ వ్యవ‌స్థను ప్రారం‌భిం‌చడం ప్రాధాన్యం సంత‌రిం‌చు‌కు‌న్నది. దీనిపై చైనా అధ్యక్షుడు జిన్‌‌పింగ్ స్పందిస్తూ, ‘బెయ్ డో’ నేవిగేషన్ వ్యవస్థ ప్రాజెక్టు పూర్తయిందని, తమదైన నూతన దిక్సూచీ వ్యవస్థను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశారు. అమెరికా జీపీఎస్, రష్యాకు గ్లోనాస్, యూరప్ గెలీలియా నావిగేషన్ వ్యవస్థల కంటే ఇది అత్యాధునికమైనదని చైనా వెల్లడించింది. 2035 సంవత్సరానికి ఈ వ్యవస్థ మరింత ఆధునికతను సంతరించుకుని ప్రపంచానికి సేవలు అందించనున్నట్లు డ్రాగన్ కంట్రీ ప్రకటించింది.