భారత్‌కే మద్దతు పలికిన అమెరికన్లు

వాస్తవం ప్రతినిధి: భార‌త్‌–‌చైనా మధ్య సైనిక, ఆర్థి‌క‌ప‌ర‌మైన అంశాల్లో వివా‌దాలు తలె‌త్తిన పక్షంలో ఏదో ఒక దేశా‌నికి మద్దతు తెలుపాల్సివస్తే భార‌త్‌కే అమె‌రికా మద్దతు ప్రక‌టిం‌చా‌లని ఎక్కు‌వ‌మంది అమె‌రి‌కన్లు కోరు‌కుం‌టు‌న్నారు. జూలై 7న ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ నిర్వ‌హించిన సర్వేలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. భారత్‌, చైనా మధ్య సైనిక వివాదం తలె‌త్తితే భార‌త్‌కే అమె‌రికా అండగా నిలు‌వా‌లని 32.6 శాతం మంది కోరు‌కు‌న్నారు. 3.8 శాతం మంది మాత్రమే చైనాకు మద్ద‌తుగా నిలి‌చారు. అదే ఆర్థిక వివాదం అయితే 36.3 శాతం మంది భారత్‌కు.. 3.1శాతం మంది చైనాకు జై కొట్టినట్లు స్పష్టం చేసింది. మరో‌వైపు, సైనిక వివాదం తలె‌త్తితే ఇరు దేశా‌లకు అమె‌రికా మద్దతు ప్రక‌టిం‌చ‌వ‌ద్దని 63.6 శాతం మంది కోరు‌కు‌న్నారు.