వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరిన 8.78లక్షల మంది ఇండియన్స్

వాస్తవం ప్రతినిధి: కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని భారత్ ప్రభుత్వం తెలిపింది. అయితే ‘వందే భారత్ మిషన్’ ద్వారా ఇప్పటివరకు 8.78లక్షల మంది భారతీయలు స్వదేశానికి చేరుకున్నట్లు వెల్లడించింది. ఇందులో నేపాల్, భూటాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో చిక్కకున్న సుమారు లక్ష మంది భారతీయులు రోడ్డు మార్గం ద్వారా ఇండియాకు చేరుకున్నట్లు వివరించింది. ‘వందే భారత్ మిషన్’ నాలుగో విడత లో 29 దేశాలకు 1,083 విమానాలను నడిపినట్లు పేర్కొంది. అంతేకాకుండా నేటినుంచి ‘వందే భారత్ మిషన్’ 5వ దశ ప్రారంభం అవుతున్నట్లు తెలిపింది.