ఎన్నారైల స‌మ‌స్య‌ల కోసం సింగిల్ విండో ఈ-హెల్ప్‌లైన్ ప్రారంభించిన దుబాయి

వాస్తవం ప్రతినిధి: దుబాయిలోని ప్ర‌వాస భారతీయుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఇండియ‌న్ ఎంబ‌సీ సింగిల్ విండో ఈ-హెల్ప్‌లైన్‌ విధానాన్ని ప్రారంభించింది. ఆగ‌స్టు 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమ‌లులోకి తీసుకువ‌స్తున్న‌ట్లు ఇండియ‌న్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ అమ‌న్ పూరీ వెల్ల‌డించారు. ప్ర‌వాస భారతీయుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు సింగిల్ విండో విధానం ద్వారా నేరుగా ఇండియ‌న్ ఎంబ‌సీని సంప్ర‌దించే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు. దీనికోసం అధికార వెబ్‌సైట్‌ https://www.cgidubai.gov.in/లో హెల్ప్‌లైన్ పేరిట ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామ‌ని పేర్కొన్నారు.