యూఏఈ వెళ్లే ప్ర‌వాసుల‌కు వీసా స్టాంప్ త‌ప్ప‌నిస‌రి: భారత పౌర విమానశాఖ

వాస్తవం ప్రతినిధి: రెసిడెన్సీ వీసా గ‌ల ప్ర‌వాసులు యూఏఈ వెళ్లే స‌మ‌యంలో పాస్‌పోర్టులో వీసా స్టాంప్ త‌ప్ప‌నిస‌రి అని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతోపాటు యూఏఈ చేరుకోగానే క్వారంటైన్‌ను అంగీక‌రిస్తూ హెల్త్ డిక్ల‌రేష‌న్ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్ర‌వాసులు కోవిడ్ -19 డీఎక్స్‌బీ స్మార్ట్ యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది. భార‌త్ నుంచి యూఏఈకి విమాన స‌ర్వీసులు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ప‌లువురు భార‌త ప్ర‌వాసులు ధృవప‌త్రాల విష‌య‌మై త‌ర‌చూ అడుగుతున్న సందేహాల వల్ల భారత పౌర విమానయాన శాఖ ఈ విషయాలను వెల్ల‌డించింది.