ఐపీఎల్‌ కామెంటేటర్‌గా నన్ను తీసుకోండి: సంజయ్‌ మంజ్రేకర్‌

వాస్తవం ప్రతినిధి: ఈ ఏడాది ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా తనను తీసుకోవాలని బీసీసీఐని సంజయ్‌ మంజ్రేకర్‌ కోరాడు. కాగా టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై విమర్శలు చేసిన కారణంగా ఈ ఏడాది భారత్‌-దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందే బోర్డు కామెంటరీ ప్యానెల్‌ నుంచి మంజ్రేకర్‌ను బీసీసీఐ తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్‌కు మళ్లీ తనను ఎంపిక చేయాలని అతడు కోరాడు. బోర్డు నిర్దేశించే మార్గదర్శకాలను అనుసరిస్తూ విధులు నిర్వర్తిస్తానని మంజ్రేకర్‌ స్పష్టం చేశాడు. జడేజాపై చేసిన వ్యాఖ్యలకు మంజ్రేకర్‌ క్షమాపణ చెప్పాడని బీసీసీఐ అధికారి చెప్పారు.