కరోనా కీలక విషయంలో ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ..!!

వాస్తవం సినిమా: టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ శుక్రవారం గచ్చిబౌలిలో సైబరాబాద్ కమిషనరెట్ లో ప్లాస్మా దాతలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ కరోనా కేసుల సంఖ్య కంటే ప్లాస్మాను దానం చేసే వారి సంఖ్య తెలంగాణలో ఎక్కువగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మహమ్మారి నుండి తప్పించుకోవాలంటే వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా నుండి కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేస్తే వేరే వ్యక్తి ప్రాణాలు కాపాడినవారు అవుతారాని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ప్లాస్మా దానంపై సైబరాబాద్ పోలీసులు ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమం అనంతరం విజయ్ దేవరకొండ సజ్జనార్ చేతుల మీదుగా ప్లాస్మా దానంపై రూపొందించిన వాల్ పేపర్స్ మరియు ఆన్లైన్ పోర్టల్ లింక్, ఫోన్ నెంబర్లను ఆవిష్కరించారు. ఇదే రీతిలో ప్రభుత్వం ప్లాస్మా దానం ప్రాముఖ్యత పై ప్రజలలో అవగాహన పెంచాలని విజయ్ దేవరకొండ కోరినట్లు సమాచారం.