ఆచార్య థియేటర్ లో ఫాన్స్ రచ్చ చేసే సీన్ ఇదే !

వాస్తవం సినిమా: మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. మాస్ కథాంశం నేపథ్యంలో మెసేజ్ ఓరియంటెడ్ తరహాలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో దాదాపు చెర్రీ పాత్ర అరగంట కి పైగా ఉంటుందని సమాచారం.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రీ ఇంటర్వెల్ అదే రీతిలో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ మెగా అభిమానులను రచ్చ చేసే విధంగా కొరటాల డిజైన్ చేశారట. చిరంజీవి కి తగ్గ రీతిలో భారీ యాక్షన్ సీన్స్ ఈ రెండు ఎపిసోడ్స్ లో మెగా అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకునేలా కొరటాల డిజైన్ చేశారట.

సగానికిపైగా కంప్లీట్ అయిన షూటింగ్ కరోనా వ్యాక్సిన్ వచ్చాక అనగా సెప్టెంబర్ నెలలో మొదలు పెట్టే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్. దాదాపు 12 సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.