ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ బన్నీ కి చెప్పి ఒప్పించాడా ?

వాస్తవం సినిమా: వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్నాడు డైరెక్టర్ కొరటాల శివ. టాలీవుడ్ ఇండస్ట్రీలో పరాజయం లేని డైరెక్టర్ గా పేరొందిన కొరటాల తీసిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టాయి. ప్రస్తుతం చిరంజీవితో “ఆచార్య” అనే సినిమా చేస్తున్నాడు. కాగా కొరటాల తర్వాత సినిమాపై అప్పట్లో అనేక రకాల ఊహాగానాలు గత కొద్ది కాలం నుండి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీతిలోనే జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ చిరంజీవి ప్రాజెక్ట్ అయిన తర్వాత చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తనకి “జనతా గ్యారేజ్” లాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాలతో అప్పట్లోనే మళ్ళీ పనిచేయాలని డిసైడ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రీతిగానే ఎన్టీఆర్ కోసం కొరటాల ఓ స్టోరీ కూడా రెడీ చేశారట. కానీ తనకి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్ లు బట్టి ఇప్పుడప్పుడే కాల్షీట్లు ఇచ్చే టైం లేదని కొరటాల కి ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం. దీంతో ఎన్టీఆర్ కోసం రాసుకున్న స్టోరీని బన్నీకి చెప్పి కొరటాల ఒప్పించినట్లు, తాజాగా కొరటాల బన్నీ కొత్త సినిమా ప్రాజెక్టుపై సరికొత్త వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. కొరటాల వంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తనకి కథ చెప్పటం తో ఏమాత్రం ఆలోచించకుండా సినిమాకి సంబంధించి లైన్ నచ్చడంతో వెంటనే బన్నీ కూడా ఓకే చెప్పినట్లు టాక్.