పవన్ ఫాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారే .. !

వాస్తవం సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. “విరూపాక్ష” అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు మొన్నటివరకు వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఈ సినిమా స్టోరీ ఒక వజ్రం చుట్టూ తిరిగే స్టోరీ అని, సినిమాలో పవన్ కళ్యాణ్ గజదొంగ పాత్ర చేస్తున్నట్లు…. సమాజంలో దుర్మార్గులు, దోపిడీదారుల నుండి దోచుకుని వాటిని పేదవాళ్లకు పంచే రీతిలో పవన్ క్యారెక్టర్ క్రిష్ డిజైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదే రీతిలో సినిమా పాన్ ఇండియా తరహాలో క్రిష్ తీస్తున్నట్లు కూడా న్యూస్ అప్పట్లో వైరల్ అయ్యింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఒక్క తెలుగు భాషలో మాత్రమే తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి కరోనా నేపథ్యంలో ఒక్క తెలుగు భాషలో మాత్రమే సినిమా రూపొందించాలని సినిమా యూనిట్ భావించినట్లు వార్తలు రావడంతో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా అన్ని ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఈ వార్త కాస్త చేదు వార్త గా మిగిలింది.