విశాఖలో ఘోరం.. క్రేన్ విరిగిపడి 10 మంది మృతి

వాస్తవం ప్రతినిధి: విశాఖపట్నం షిప్‌యార్డులో చిన్న సాంకేతిక లోపం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. క్రేన్‌ను తనిఖీ చేస్తుండగా అది ఒక్కసారిగా విరిగిపడింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 10 మంది చనిపోయాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముది. క్రేన్ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ తర్వాత విశాఖలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.