మాణిక్యాలరావు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన చిరంజీవి!

వాస్తవం ప్రతినిధి: బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి స్పందించారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాతో మృతి చెందారన్న వార్తతో విషాదానికి లోనయ్యానని అన్నారు. మాణిక్యాలరావు ఎంతో మంచి మనిషి అని, ఓ సామాన్యుడిలా రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవులు చేపట్టే స్థాయికి ఎదిగారని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.