నాకు కరోనా వస్తే..మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో గాంధీ ఆసుపత్రి పై ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. సరైన సదుపాయాలు లేవని ఎక్విప్మెంట్ కొరత ఉందని బెడ్స్ సరిపోవడంలేదని ఇలా పలు రకాలుగా ఆరోపణలు విమర్శలు తలెత్తుతుండడంతో ప్రజలు గాంధీ ఆసుపత్రి కి వెళ్ళడానికే భయపడుతున్నారు.

అయితే ఈ నేపధ్యంలో తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు కరోనా వస్తే, గాంధీ ఆసుపత్రికే వెళ్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోందని ఆయన చెప్పుకొచ్చారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గంలో రూ. 700 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఈ సందర్భం గా తలసాని చెప్పుకొచ్చారు.