అన్ ‌లాక్ 3.O : ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్ ..!!

వాస్తవం ప్రతినిధి: క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్ ప్ర‌క్రియ ముగిసి.. అన్‌లాక్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. దేశవ్యాప్తంగా అన్‌లాక్ 3.O అమల్లోకి వచ్చింది. అన్‌లాక్‌ 2.0 ముగియడంతో.. ఆగస్టు 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే కేంద్రం దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని.. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, గూడ్స్ రవాణాపై పూర్తిగా ఆంక్షలు తొలిగించింది. అయితే, అన్‌లాక్ 3.O అమల్లోకి రావడంతో ఏపీకి రావాలంటే పాస్ అవసరం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

ఎవరైనా ఏపీలోకి రావాలంటే ఖచ్చితంగా ఈ-పాస్ ఉండాలని స్ప‌ష్టం చేస్తున్నారు అధికారులు. ఏపీకి వచ్చే వారు తప్పనిసరిగా స్పందనలో దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల అనుమతి నిబంధనల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సడలింపులు చేసింది. అన్‌లాక్‌ 3 నిబంధనల మేరకు వీటిని సడలించినట్లు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆటోమెటిక్‌ ఈపాస్‌ జారీకి నిర్ణయించారు

ఏపీకి వచ్చే వారు స్పందన వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.. ఆటోమాటిక్ గా ఈ పాస్ మొబైల్, ఈ మెయిల్‌కి వస్తుంది. దానిని చెక్ పోస్టులో నమోదు చేయించుకుని.. ఏపీలోకి రావొచ్చు.  పాస్ తీసుకుని ఇతర రాష్ట్రాల నుండి ఏపీలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏపీలోకి అనుమతిస్తారు. ఈ- పాస్ ఉన్న వాహనదారుల దగ్గర నుంచి ఆధార్ నెంబర్, చిరునామాను నమోదు చేసుకున్న తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తారు.. అనుమానం ఉన్నవారికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరి. కేవలం అత్యసవరమైన వారికి మాత్రం సడలింపులు ఇచ్చారు.