పవన్ ప్రశ్నలకు ప్రజల ప్రశంసలు!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు బిల్లు కు గవర్నర్ ఆమోదం పొందటంతో ఏపీ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే ఈ నిర్ణయాన్ని టిడిపి వ్యతిరేకిస్తున్నా గాని పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు పరిణితి చెందిన రాజకీయ నేతగా వ్యవహరించినట్లు ఉందని మేధావులు అంటున్నారు.

అమరావతిని ఏపీ రాజధాని గా చంద్రబాబు ప్రభుత్వం గుర్తించిన టైంలోనే…. పవన్ స్పందిస్తూ ఇది కొంతమందికి మాత్రమే రాజధానిగా ఉన్నట్లు నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. అయినా కానీ టిడిపి ప్రభుత్వం అమరావతి రాజధానిగా గుర్తించడంతో… ప్రభుత్వమే రాజధానిని ఏర్పాటు చేయటంతో పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా మాట్లాడలేదు.

అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ 3 రాజధానులు కాన్సెప్ట్ తెరపైకి తెచ్చిన టైం లో రాజధాని కోసం కొన్ని వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు రోడ్డున పడటంతో రైతుల తరపున పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. దీంతో అధికార పార్టీ అమరావతికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్నాడని తెగ ప్రచారం చేశారు.

పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల గవర్నర్ మూడు రాజధానులు నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…టిడిపి నాయకులూ అండ్ మీడియా పవన్ ని టార్గెట్ చేస్తున్న గాని ఏపీ జనాలు మాత్రం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు చాలా కరెక్ట్ అని అంటున్నారట.

కారణం చూస్తే పవన్ కళ్యాణ్ మొదటిలోనే “అమరావతి” ని టీడీపీ కాపిటల్ గా గుర్తించినప్పుడు అది కొంతమంది రాజధాని అని ప్రశ్నించాడు, ఆ తర్వాత జగన్ హయాంలో మూడు రాజధానులు అని అన్నపుడు అన్యాయం జరిగిన రైతుల తరపున ప్రశ్నించాడు… నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ రాజకీయాలు చేశాడు. ఇందులో ఆయనను విమర్శించడానికి ఎలాంటి తావు లేదు అని, పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఏపీ రాజధాని ఎపిసోడ్ లో వ్యవహరించారని తాజాగా 3 రాజధానుల నిర్ణయం తర్వాత పవన్ స్పందనపై ఏపీ జనాలు అంటున్న మాటలివి.

ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ సరైన రీతిలోనే రెండు ప్రభుత్వాలను రాజధాని విషయాలలో పవన్ ప్రశ్నించారని చెప్పుకొస్తున్నారు. ఎక్కడా కూడా ఏ ఒక్కరికి సపోర్టుగా పవన్ వ్యవహరించలేదని పేర్కొంటున్నారు.