ఆ నిర్ణయమే జగన్ కొంప ముంచుతుందా..??

వాస్తవం ప్రతినిధి: అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానులు అంటూ మొండి పట్టు పట్టి పంతం నెగ్గించుకున్నా, రాబోయే రోజుల్లో ఏ మాత్రం ఇది బెడిసికొట్టినా, జగన్ పార్టీ కి భారీ డ్యామేజ్ గ్యారెంటీ అని మేధావులు అంటున్నారు. ఇప్పటికే గుంటూరు మరియు కృష్ణా జిల్లాలలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీపై కొంత వ్యతిరేకత వచ్చిందని, ఇలాంటి తరుణంలో వచ్చే ఎన్నికల నాటికి విశాఖ మరియు కర్నూలు ప్రాంతంలో రాజధాని కి సంబంధించి ఎలాంటి పనులు జరగకుండా కాలయాపన చేస్తే ఆ రెండు ప్రాంతాలలో ప్రజలు కూడా జగన్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా మహమ్మారి కరోనా ఎఫెక్ట్ తో ఏపీ ఖజానా కుదేలు పడిన తరుణంలో… ఇలాంటి పరిస్థితుల్లో కర్నూలులో హైకోర్టు మరియు విశాఖపట్నంలో ప్రభుత్వ భవనాలు కట్టడం అంత సులువు కాదని, ముందు ఉంది అంతా గడ్డుకాలమే అంటూ మేధావులు పేర్కొంటున్నారు.