కరోనా నుండి కోలుకున్న విజయసాయిరెడ్డి..!!

వాస్తవం ప్రతినిధి: వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి ఇటీవల కరోనా బారిన పడిన విషయం అందరికి తెలిసిందే. దీంతో వెంటనే హైదరాబాద్ నగరంలో అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్న విజయసాయిరెడ్డి కి తాజాగా కరోనా నెగిటివ్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా స్వయంగా ఆయనే వెల్లడించారు. దాదాపు పది రోజులు హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న విజయసాయిరెడ్డి భగవంతుని దయ తో కరోనా ని జయించినట్లు ట్విట్టర్లో వెల్లడించారు. విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ఏమన్నారంటే… “భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞుడిని. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను.” అంటూ పేర్కొన్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజుకి పది వేల కంటే ఎక్కువ నమోదు కావడంతో ప్రజలలో భయాందోళనలు ఉన్న కొద్ది ఎక్కువైపోతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే లక్ష కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగిపోవడంతో… సామాన్య జనాలు ఇంటి నుండి బయటకు రావడానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.