సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్‌ కన్నుమూత!

వాస్తవం ప్రతినిధి: రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్‌ కన్నుమూశారు. కిడ్నీ సంబంధ అనారోగ్యంతో ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 64 ఏళ్ల అమర్ సింగ్ కు భార్య పంకజ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నటి జయపద్రను రాజకీయాల్లోకి తీసుకురావడంతోపాటు యూపీ రాజకీయాల్లో ఒకప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉన్న అమర్ 2013 నుంచి మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఏడు నెలల పాటు సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందరు. తర్వాత ముంబైలో చేరారు. 1956లో యూపీలోని అజమ్‌ఘర్‌లో జన్మించిన అమర్‌సింగ్‌ తొలిసారి 1996లో రాజ్యసభకు ఎన్నికైయ్యారు. 2016లో సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో ‘స్వతంత్ర’ అభ్యర్థిగా చివరిసారి ఎన్నికయ్యారు. అయ్యారు. ఆయన మొత్తం నాలుగు పర్యాయాలు ఎంపీగా ఉన్నారు.