ఒక్క రూపాయి ఖర్చు పెట్టని అసమర్థులు 3 రాజధానులు ఎలా నిర్మిస్తారు..!!

వాస్తవం ప్రతినిధి: మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంపై రాజకీయ దుమారం రేగుతోంది. గవర్నర్ నుంచి మూడు రాజధానులకు ఆమోదం తెలపడంతో మరోసారి ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. దీనితో ప్రతిపక్ష పార్టీలు మూడు రాజధానులు వద్దని మరోసారి వైసీపీ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజధానిలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టని అసమర్థులు 3 రాజధానులు ఎలా నిర్మిస్తారన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేయబడిన హైకోర్టును 32 కేసుల్లో సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న జగన్ హైకోర్టును ఎలా మారుస్తారన్నారు. న్యాయస్థానాలలో న్యాయం గెలుస్తుందని.. రాష్ట్ర రాజధాని అమరావతినే కొనసాగించాలని దేవినేని ఉమ పేర్కొన్నారు.

మరోవైపు విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంపై వైసీపీ సంబరాలు చేసుకుంటోంది. శనివారం ఉదయం జగదాంబ కూడలి వద్ద సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే శెట్టి పాల్గొన, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ పూలమాలవేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చివరకు సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకున్నది సాధించారని ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు.