అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయండి: డొనాల్డ్‌ ట్రంప్‌

వాస్తవం ప్రతినిధి: నవంబరులో జరగాల్సిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ప్రజలు సరిగ్గా, భద్రంగా, సురక్షితంగా ఓటు వేయగలిగేవరకు ఎన్నికలను వాయిదా వేయాలని గురువారం ట్వీట్‌ చేశారు. అయితే, మెయిల్‌-ఇన్‌ ఓటింగ్‌కు అనుమతి ఇస్తే ఈ ఎన్నికలు మోసపూరిత ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొవిడ్‌-19 సంక్షోభం నుంచి కోలుకుని ప్రజలు సరిగ్గా తమ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి వచ్చే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మెయిల్‌ ద్వారా ఓటేసే సదుపాయాన్ని కల్పించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. అయితే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. అయితే మరోవైపు ట్రంప్‌ ట్వీట్‌పై ప్రతిపక్ష పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్‌-2, సెక్షన్‌-1 ప్రకారం నిర్ధిష్ట సమయంలో ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయని వారు తెలిపారు.