ఆగస్టు 15 లోపే దుబాయ్ చేరనున్న చెన్నై సూపర్ కింగ్స్

వాస్తవం ప్రతినిధి: యూఏఈ వేదికగాఈ ఏడాది జరగబోయే ఐపీఎల్‌ కు ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. సెంట్రల్‌ గవర్నమెంట్‌ అనుమతితోపాటు బీసీసీఐ ఆదేశాలు వచ్చిన వెంటనే టీమ్‌ ను దుబాయ్‌ పంపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్ ఈ విషయంలో అందరికంటే ఓ అడుగు ముందుంది. ఆగస్టు 15 లోపే ట్రెయినింగ్‌ క్యాంప్‌ స్టార్ట్‌‌ చేయాలనేది చెన్నై సూపర్‌ కింగ్స్ ఆలోచన. బీసీసీఐ నుంచి స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ అందిన వెంటనే ట్రావెల్‌ ప్లాన్‌ ను ఫైనల్‌ చేస్తాం అని చెన్నై సూపర్‌ కింగ్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ తొలి వారంలో దాదాపు అన్ని జట్ల ట్రెయినింగ్‌ షురూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్‌ 13వ ఎడిషన్‌ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్‌ చేసింది.