మూడు రాజ‌ధానుల‌పై కేంద్రం జోక్యం చేసుకోదుః సోము వీర్రాజు

వాస్తవం ప్రతినిధి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమరావతి విషయంలో నాడు చంద్రబాబు హామీలపై కేంద్రం జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు మూడు రాజధానుల విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు స్ప‌ష్టం చేశారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీ వెళ్లిన సోము వీర్రాజు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడుతోపాటు, పార్టీ ప్ర‌ముఖుల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో క‌ల‌సి ఆయ‌న మీడియాతో మాట్లాడారు.