గంటా కి కారణం ఉందా ? మొండిగా ఉంటే నష్టం అనుకుంటున్నారా ?

వాస్తవం ప్రతినిధి: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ పార్టీ లోకి వెళ్ళటానికి రెడీ అయినట్లు ఏపీ రాజకీయాల లో వార్తలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి గంటా శ్రీనివాస్ మొదటిలోనే వైసీపీ గూటికి చేరాలని ప్రయత్నించిన సమయంలో విశాఖ వైసీపీలో కీలక నాయకులైన విజయసాయిరెడ్డి అదే రీతిలో అవంతి శ్రీనివాస్ అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా మాత్రం గంట తనకు అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని పక్కకు నెట్టుకుని నేరుగా జగన్ తో మంతనాలు జరిపి టిడిపి పార్టీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు విశాఖలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

గంట పార్టీ మారడానికి కారణం టిడిపిలో నాయకత్వ లోపమే అని అందువల్ల భవిష్యత్ లో రాజకీయాల్లో రాణించాలంటే కచ్చితంగా వైసీపీలోకి వెళ్లటమే బెటర్ అన్న రీతిలో అనుచరులతో మంతనాలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంకా మొండిగా టిడిపిలోనే ఉంటే పొలిటికల్ గా డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారట.

ఇదిలా ఉండగా విశాఖలో ఉండే వైసీపీ కీలక నాయకులు గంటా శ్రీనివాస్ రాకలు విభేదించే వారు మరో రకంగా స్పందిస్తున్నారు. గంటా పార్టీ లోకి రావటం వెనుక ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలే అని చెప్పుకొస్తున్నారు. ఇటీవల పలు కుంభకోణాల్లో ఈయన పేరు బయటపడటంతో ముందు జాగ్రత్తగా పార్టీలోకి వచ్చేస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా వచ్చే నెల లోపు గంటా శ్రీనివాస్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే వార్తలు స్పష్టంగా వినబడుతున్నాయి.