ఉత్తరకొరియా అధినేత నోటి వెంట శాంతి ప్రవచనాలు!

వాస్తవం ప్రతినిధి: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రస్తుతం శాంతి ప్రవచనాలు పలుకుతున్నారు. ఎప్పుడూ దక్షిణ కొరియాతో పాటు అమెరికాపై గుర్రుగా వుండే కిమ్ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. కొరియా యుద్ధం ముగిసి ఇప్పటికి సరిగ్గా 67 సంవత్సరాలు అయింది. ఈ నేపథ్యంలో నిన్న 67వ వార్షికోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమం సందర్భంగా మాజీ ఆర్మీ అధికారులతో కిమ్ సమావేశం నిర్వహించారు. దేశం అణ్వస్త్రాలను కలిగి ఉందని, తమ దేశం జోలికి ఎవరు వచ్చినా ఊరుకోబోమని చెప్తూనే, అన్ని దేశాలు సరిహద్దు విషయాల్లో దౌత్యపరమైన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీనికి ప్రధాన కారణం అత్యాధునిక ఆయుధాలు, అణ్వస్త్రాలే అని చెప్పుకొచ్చారు. ఇప్పట్లో రెండో కొరియన్ యుద్ధం జరిగే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు ఉత్తర కొరియాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం మంచి పరిణామంగా చెప్పుకోచ్చారు.