ఆ మూడు దేశాల మంత్రులతో చైనా భేటీ!

వాస్తవం ప్రతినిధి: కరోనా అదుపుపై చైనా మూడు దేశాలతో చర్చలు జరిపింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ దేశాల విదేశాంగ మంత్రులతో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ చర్చించారు. దీనితో బాటు ఎకనమిక్ రీకవరీని పెంచడం, తమ నాలుగు దేశాల పరిధిలో రోడ్డు ప్రాజెక్టులను, కారిడార్ల నిర్మాణాలను చేపట్టడం వంటి ఇతర అంశాలు కూడా వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. మహమ్మారిపై పోరులో నాలుగు దేశాలు ఒక్కటిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి నివారణకు పరస్పర ప్రాంతీయ సహకారం, ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని షేర్ చేసుకోసుకోవాలని తెలిపారు. ఏకాభిప్రాయంతో ఐకమత్యంగా వైరస్‌ అంతానికి కృషి చేయాలన్నారు. చైనా వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రానుందని.. పాక్‌, బంగ్లా, అఫ్గానిస్తాన్‌లకు ఈ టీకాను అందజేసి మహమ్మారిని అంతం చేసి, ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు వెన్నుదన్నుగా ఉంటామని భరోసా ఇచ్చారు.