వుహాన్ ప్ర‌భుత్వ అధికారులు వైర‌స్ ఆన‌వాళ్ల‌ను తుడిచేశారు!

వాస్తవం ప్రతినిధి: క‌రోనా వైర‌స్‌కు చైనాలోని వుహాన్ న‌గరం కేంద్ర బిందువు అని తెలిసిందే. అయితే వుహాన్ ప్ర‌భుత్వ అధికారులు క‌రోనా వైర‌స్ కేసుల‌కు సంబంధించిన ఆన‌వాళ్ల‌ను తుడిచిపెట్టిన‌ట్లు చైనా డాక్ట‌ర్ క్వాక్ యుంగ్ యువెన్ ఆరోపిస్తున్నారు. అక్కడి అధికారులు మొద‌ట్లో భౌతిక ఆధారాల‌ను నాశ‌నం చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. క్లినిక‌ల్ డేటాను కూడా రిలీజ్ చేయ‌డంలో ఆల‌స్యం చేసిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. వుహాన్‌లోని హువ‌న‌న్ సూప‌ర్‌మార్కెట్‌కు వెళ్లిన‌ప్పుడు.. అక్క‌డ మార్కెట్‌ను పూర్తిగా శుభ్రం చేసేశార‌ని ఆయన అన్నారు. వుహాన్ అధికారులు వైర‌స్ కేసుల‌ను క‌ప్పిపుచ్చేందుకు ప్ర‌య‌త్నించి ఉంటార‌ని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు.  వైర‌స్ పై అధ్యయనం కోసం చేయాల్సిన ప‌నుల‌ను అధికారులు అడ్డుకున్న‌ట్లు చెప్పారు.