టీమిండియా గొప్ప ఫినిషర్‌ కోసం ఎదురుచూస్తోంది: డీన్ జోన్స్

వాస్తవం ప్రతినిధి: ఎంఎస్ ధోని చురుకైన కెప్టెన్, మంచి బ్యాట్స్‌మెన్‌తో పాటు గొప్ప వికట్‌ కీపర్‌ కూడా అనడంలో అతిశయోక్తి లేదు. 2011 ప్రపంచ కప్‌లో ధోని భారత క్రికెట్‌ అభిమానుల మనస్సుల్లో శాశ్వతమైన జ్ఞాపకంగా మిగిలాడు. గతేడాది వరల్డ్‌ కప్‌లో కూడా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో ధోని మ్యాచ్‌ విన్నర్‌గా నిలుస్తాడని అందరు అనుకున్నారు. కాని ధోని రనౌట్‌ కావడంతో భారత్‌ ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో రిషబ్ పంత్, కె.ఎల్.రాహుల్‌లను వికెట్ కీపర్‌గా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ క్రికెట్‌కు ధోని లేకపోవడం గురించి మాట్లాడాడు. ఇప్పుడు టీమిండియా గొప్ప ఫినిషర్‌ కోసం ఎదురుచూస్తోంది. ఇది ఇప్పుడు ఆ జట్టుకు ప్రధాన సమస్య అని అన్నాడు. ఈ ఐపీఎల్‌లో రాణించకపోతే బహుశా ధోని మళ్లీ అంతర్జాతియ క్రికెట్‌లో ఇండియాతో కలిసి ఆడే అవకాశాలు తక్కువ అని డీన్ జోన్స్ అన్నాడు.