నవరస నటనా సార్వభౌమ : శ్రీ కైకాల సత్యనారాయణ

గంభీరమైన వాచకంతో, నవరసభరితమైన నటనతో, అబ్బురపరచే ఆంగికంతో, హావభావాలను చిలికిస్తూ నటనకే భాష్యం చెప్పిన నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ. వీర, రౌద్ర, బీభత్స రసాలను అటు పౌరాణిక జానపదాల్లోను, ఇటు చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాలలోను తనదైన శైలితో మెప్పించిన గొప్ప నటుడు శ్రీ కైకాల సత్యనారాయణ గారు.

కెసినోలో ఆడేవారికి తెలుసు 777 గొప్పతనం. చలనచిత్రపరిశ్రమలో 777 చిత్రాలలో విలక్షనమైన నటనను అభినయించి ప్రేక్షకులను మెప్పించి , మేరునగదీరుడు ఎస్వీయార్ గారు తరువాత ప్రతినాయక పాత్రలలో మన్ననలు పొంది  ఏనబైఐదో పడిన నటుడు గౌరవ కైకాల సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు .

న‌వ‌ర‌స న‌టసార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ పుట్టినరోజు నేడు. 85 ఏళ్లు పూర్తి చేసుకున్న కైకాల.. జూలై 25 నాటితో 86 ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందించిన అభిమానులకు శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు న‌వ‌ర‌స న‌టసార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ. నేడు (జూలై 25) ఆయన పుట్టిన‌రోజు నేడు. న‌టుడుగా గ‌త ఏడాది ష‌ష్ఠిపూర్తి చేసుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా భ‌క్త ప్ర‌హ్లాద విడుద‌ల అయితే.. 1935 జులై 25న స‌త్య‌నారాయ‌ణ జ‌న్మించారు. 1959లో ఆయ‌న న‌టించిన సిపాయి కూతురు విడుద‌లైంది. ఇప్ప‌టికి న‌టుడిగా 61 సంవ‌త్స‌రాలు కాగా.. వ్య‌క్తిగ‌తంగా ఈ ఏడాది జులై 25కి 85 సంవ‌త్స‌రాలు పూర్త‌ి చేసుకుని 86 ఏట అడుగుపెట్టారు. నేడు ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేరు పేరునా వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌మ్ముళ్లు చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌కు ప్ర‌త్యేకించి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు    తెలిపారు. త‌న బందుమిత్రులు, కుటుంబ స‌భ్యులు స‌హా అభిమానుల‌కు ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

మనప్రియతమ నేత, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో – సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ జన్మదినం సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నవరసాలను అలవోకగా పండించగల కైకాల సత్యనారాయణ తెలుగునేలపై జన్మించడం తెలుగువారి అదృష్టం అని పేర్కొన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ రావడంలో ఆయన కృషి ఎంతో ఉందని తెలిపారు. మద్రాస్ లో ఉన్నప్పటి నుంచే సత్యనారాయణతో తమ కుటుంబానికి అనుబంధం ఉందని, ఎప్పుడు కలిసినా ఎంతో వాత్సల్యంతో మాట్లాడేవారని పవన్ గుర్తు చేసుకున్నారు.

సినీ రంగంలో   అంచెలంచెలుగా ఎదిగి అనేకమంది కళాకారులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. అయితే, నటనలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయనకు ప్రభుత్వపరంగా ఎలాంటి గుర్తింపు రానందుకు ఎంతో బాధగా ఉందని, తానే కాకుండా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా ఈ విషయంలో విచారం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కైకాల సత్యనారాయణకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించే విధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు.

ప్రస్తానం:

కైకాల స‌త్య‌నారాయ‌ణ‌..తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్ళ‌కు పుట్టారు. తెలుగు సినిమాతో స‌మాంత‌రంగా ఎదిగారు..న‌టుడుగా గ‌త ఏడాదికే ష‌ష్ఠిపూర్తి చేసుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా భ‌క్త ప్ర‌హ్లాద విడుద‌ల అయితే..1935 జులై 25న స‌త్య‌నారాయ‌ణ జ‌న్మించారు. 1959లో ఆయ‌న న‌టించిన చిత్రం సిపాయి కూతురు విడుద‌ల‌యింది. ఆ ర‌కంగా ఆయ‌న న‌టుడు అయి..61 సంవ‌త్స‌రాలు కాగా..వ్య‌క్తిగ‌తంగా ఈ ఏడాది జులై 20కి 85వ సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటున్నారు. తెలుగు సినిమా అభిమానులు అంద‌రికీ స‌త్య‌నారాయ‌ణ జీవిత చ‌రిత్ర సినిమా విశేషాలు తెలిసిన‌వే..అయినా రేపు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా..సింహావ‌లోక‌నం చేసుకుందాం.

హీరోగా సినిమా రంగానికి ప‌రిచ‌యం అయినా..ఆ సినిమా నిరాశ‌ప‌ర్చ‌డంతో విల‌న్ గా మార‌డానికి త‌ట‌ప‌టాయించ‌లేదు. జాన‌ప‌ద బ్ర‌హ్మ విఠ‌లాచార్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఎన్నెన్నో జాన‌ప‌ద చిత్రాల్లో స‌త్య‌నారాయ‌ణ విల‌న్ పాత్ర‌లు పోషించారు. ఆ త‌ర్వాత సోష‌ల్ పిక్చ‌ర్స్ లో కూడా విల‌న్ పాత్ర‌లు వ‌చ్చాయి. స‌త్య‌నారాయ‌ణ న‌వ్వు పాపుల‌ర్ విల‌నీ ట్రేడ్ మార్క్ అయింది. కెరీర్ తొలిద‌శ‌లోనే ఆయ‌న‌కి పౌరాణిక పాత్ర‌లు చేసే అవ‌కాశం ల‌భించింది. ల‌వ‌కుశ‌లో భ‌ర‌తుడిగా..శ్రీకృష్ణార్జున యుద్ధంలో క‌ర్ణుడిగా..న‌ర్త‌న‌శాల‌లో దుశ్శాస‌నుడిగా న‌టించారు. శ్రీకృష్ణ‌పాండ‌వీయంలో ఘ‌టోత్క‌చుడి పాత్ర తొలిసారి ధ‌రిస్తే మ‌ళ్ళీ 1995లో ఎస్‌.వి.కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఘ‌టోత్క‌చుడు చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించారు.

శ్రీకృష్ణావ‌తారం చిత్రంలో తొలిసారి దుర్యోధ‌నుడి పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత కురుక్షేత్రంలో దుర్యోధ‌నుడిగా అద్భుతంగా ర‌క్తి క‌ట్టించారు. అలాగే రావ‌ణాసురుడిగా సీతాక‌ళ్యాణంలో..భీముడిగా దాన‌వీర‌శూర‌క‌ర్ణ‌లో..మూషికాసురుడిగా శ్రీ వినాయ‌క విజ‌యం చిత్రాల్లో న‌టించారు. చాలా మందికి తెలియ‌ని విశేష‌మేమిటంటే క‌థానాయిక మొల్ల‌లో శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు పాత్ర పోషించారు. య‌మ‌ధ‌ర్మ‌రాజు అంటే తెలుగు తెర‌కి స‌త్య‌నారాయ‌ణ త‌ప్ప మ‌రొక‌రు గుర్తురారు. య‌మ‌గోల సినిమాతో ప్రారంభ‌మైన ఈ పాత్ర జైత్ర‌యాత్ర య‌ముడికి మొగుడు..య‌మ‌లీల‌..రాధామాధ‌వ్‌..ద‌రువు చిత్రాల వ‌ర‌కూ సాగింది. మోస‌గాళ్ళ‌కు మోస‌గాడు..దొంగ‌ల వేట మొద‌లైన సినిమాల్లో ఆయ‌న విల‌న్ పాత్ర‌లు మ‌ర్చిపోలేనివి.

ఉమ్మ‌డి కుటుంబం..దేవుడు చేసిన మ‌నుషులు..శార‌ద చిత్రాల‌తో ఆయ‌న ఇమేజ్ మారింది. సాత్విక‌మైన పాత్ర‌ల‌కు కూడా స‌త్య‌నారాయ‌ణ బెస్ట్ ఆప్ష‌న్ అయ్యారు. తాత‌, మ‌న‌వడు, సంసారం, సాగ‌రం, రామ‌య్య తండ్రి, జీవిత‌మే ఒక నాట‌క‌రంగం, దేవుడే దిగివ‌స్తే, సిరి సిరి మువ్వ, తాయార‌మ్మ, బంగార‌య్య‌, పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌రులు మొద‌లైన చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషించి విల‌న్ ఇమేజ్ నుంచి బ‌య‌ట‌ప‌డి..కుటుంబ ప్రేక్ష‌కుల‌కు అభిమాన న‌టుడ‌య్యారు.

క‌మెడియ‌న్ న‌గేష్ డైరెక్ట‌ర్ గా..స్టార్ ప్రొడ్యూస‌ర్ డి.రామానాయుడు నిర్మించిన మొర‌టోడు చిత్రంతో హీరోగా మారారు. నా పేరే భ‌గ‌వాన్, ముగ్గురు మూర్ఖులు, ముగ్గురు మొన‌గాళ్ళు, కాలాంత‌కులు, గ‌మ్మ‌త్తు గూడ‌చారులు, తూర్పు ప‌డ‌మ‌ర, సావాస‌గాళ్ళు లాంటి చిత్రాల్లో హీరోతో స‌మాంత‌ర‌మైన పాత్ర‌లు పోషించారు స‌త్య‌నారాయ‌ణ‌. చాణ‌క్య చంద్ర‌గుప్త‌లో రాక్షస‌మంత్రిగా న భూతో న భ‌విష్య‌త్ అన్న‌ట్లు న‌టించారు. నా పిలుపే ప్ర‌భంజ‌నంలో ముఖ్య‌మంత్రి పాత్ర‌తో విస్మ‌య‌ప‌రిచారు. ఒక‌టా..రెండా వంద‌లాది చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి తెలుగు సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు.

సుభాష్ ఘాయ్ డైరెక్ట్ చేసిన హిందీ సినిమా క‌ర్మ‌లో విల‌న్ గా న‌టించారు. ఈ సినిమాలో శ్రీదేవి తండ్రి పాత్ర ధ‌రించారు. ఒక‌టీ..రెండు తెలుగు డైలాగ్స్ కూడా ఆ సినిమాలో చెప్పారు స‌త్య‌నారాయ‌ణ‌. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ లతో కొన్ని చిత్రాలతో పాటుగా కన్నడ, హిందీ సినిమాల్లో కూడా కైకాల సత్యనారాయణ నటించడం జరిగింది. కైకాల స‌త్య‌నారాయణ‌‌కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉమ్మ‌డి ప్ర‌భుత్వం ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డుతో గౌర‌వించుకుంది. ఆ మ‌ధ్య విడుద‌ల‌యిన మ‌హ‌ర్షి చిత్రంలో కూడా న‌టించారు స‌త్య‌నారాయ‌ణ‌. త‌ను న‌టించిన ప్ర‌తీ పాత్రను త‌న సొంత బిడ్డ‌లాగే భావించి..వాటికి ప్రాణ ప్ర‌తిష్ట చేశారు. ప్ర‌స్తుతం 85సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఇంట్లో ప్ర‌శాంత‌మైన జీవ‌నాన్ని గ‌డుపుతూ..పాత సినిమాలు చూస్తూ..ఆనందంగా కాల‌క్షేపం చేస్తున్నారు స‌త్య‌నారాయ‌ణ‌.

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిద్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు.

సత్యనారాయణ కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు మరియు ఇద్దరు కొడుకులు.

సినీ జీవితం

తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాల్లో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. ఆయన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959 లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గురించటానికి ఆసక్తి గల కారణం, ఆయన రూపు రేఖలు యన్.టి.ఆర్ ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడ ఈయన్ని గమనించారు. 1960 లో యన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి లో ఈయనకి ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు యస్.డి.లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసాడు.

తొలి ప్రయత్నాలు…

కృష్ణా జిల్లా కౌతవరం సత్యనారాయణ (25 ఝుల్య్ 1935) జన్మస్థలం. హైస్కూల్‌ చదువు గుడ్లవల్లేరులో, కాలేజి చదువు విజయవాడ, గుడివాడలో పూర్తిచేశారు. మంచి స్ఫురద్రూపి, రింగుల జుట్టుతో చూపరులకు ఎన్టీఆర్‌లా కనిపించేవారు. దాంతో నాటకాల మీద అభిరుచి పెరిగి ఎప్పటికైనా మంచి సినిమా నటుడిగా ఎదగాలని కలలు కన్నారు. ఇంటర్మీడియట్‌ చదివే రోజుల్లో వివిధ నాటక సంస్థల తరపున రాష్ట్రమంతా పర్యటించి పల్లెపడుచు, బంగారు సంకెళ్లు, ప్రేమలీలలు, కులంలేని పిల్ల, ఎవరుదొంగ వంటి నాటకాల్లో అటు విలన్‌గా ఇటు హీరోగా కూడా నటిస్తూ ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. 1955 నాటికే డిగ్రీ పూర్తి చేయగలిగినా సత్యనారాయణకు ఉద్యోగం రాలేదు. రాజమండ్రిలో సత్యనారాయణ కుటుంబానికి కలప వ్యాపారం ఉండేది. అక్కడ కొంతకాలం గడిపి, స్నేహితుడు కె.ఎల్‌.ధర్‌ సలహాలపై సినిమాల్లో ప్రయత్నాలు సాగించేందుకు మద్రాసు వెళ్లారు. ఆ స్నేహితుడు ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలో సహాయ కళాదర్శకుడిగా పనిచేస్తుండేవాడు. ‘కొడుకులు-కోడళ్లు’ అనే సినిమా కోసం దర్శక నిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌, సత్యనారాయణకు స్క్రీన్‌ టెస్టులన్నీ చేసి ఓకే చేశారు. దురదృష్టవశాత్తు ఆ సినిమా ప్రారంభం కాలేదు. మొక్కవోని ధైర్యంతో సత్యనారాయణ దర్శకనిర్మాత బి.ఎ.సుబ్బారావును కలిశారు. ఆయన సత్యనారాయణను ప్రముఖ దర్శకనిర్మాత కె.వి.రెడ్డి వద్దకు పంపితే ఆయన మేకప్‌ టెస్ట్‌, వాయిస్‌ టెస్ట్‌, స్క్రీన్‌ టెస్ట్‌ అన్నీ చేయించి కూడా అవకాశం కల్పించలేకపోయారు. అలా ‘దొంగరాముడు’ సినిమాలో తనకు దక్కాల్సిన పాత్ర ఆర్‌.నాగేశ్వరరావుకు దక్కింది. చివరకు దేవదాసు నిర్మాత డి.ఎల్‌.నారాయణ సత్యనారాయణను స్ఫురద్రూపాన్ని చూసి, అతని గెటప్‌ నచ్చి, చందమామ బ్యానర్‌పై చెంగయ్య దర్శకత్వంలో తీసిన ‘సిపాయి కూతురు’లో హీరోగా జమున సరసన నటింపజేశారు. అదే సత్యనారాయణకు మొదటి సినిమా. ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. డి.ఎల్‌. మూడు సంవత్సరాల అగ్రిమెంటు మీద సత్యనారాయణతో నెలకు మూడువందల రూపాయల జీతం మీద కాంట్రాక్టు కుదుర్చుకోవడంతో, అతనికి ఇతర సంస్థల్లో నటించడానికి అవకాశం లేకపోయింది. ‘సిపాయి కూతురు’ దెబ్బతినడంతో డి.ఎల్‌ కూడా సత్యనారాయణతో మరో సినిమా ప్రారంభించలేకపోయారు. ఎన్టీఆర్‌కు దగ్గర పోలికలుండటం చేత సత్యనారాయణ ఖాళీగా ఉండకుండా ఆయనకు డూపుగా చాలా సినిమాల్లో నటించారు. 1960లో ఎన్టీఆర్‌ చొరవతోనే మోడరన్‌ థియేటర్స్‌ వారి ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ చిత్రంలో అతిధి నటుడిగా నటించారు. ఈ సినిమా దర్శకుడు ఎస్‌.డి.లాల్‌ విఠలాచార్య శిష్యుడు కావటంచేత, సత్యనారాయణలో ఉన్న ట్యాలెంట్‌ను గుర్తించి విఠలాచార్యకు చెప్పి ప్రతినాయకునిగా ‘కనకదుర్గ పూజామహిమ’లో నటింపజేశారు. అందులో సత్యనారాయణ పోషించిన సేనాధిపతి పాత్ర అతన్ని విలన్‌గా నిలబెట్టింది. అప్పుడే నాగేశ్వరమ్మతో సత్యనారాయణకు వివాహం జరిగింది. ఆపై హీరోగా నిలదొక్కుకోవలసిన సత్యనారాయణ దుష్ట పాత్రలకు పరిమితం కావలసి వచ్చింది. బి.ఎన్‌.రెడ్డి కూడా ‘రాజమకుటం’ సినిమాలో సత్యనారాయణ చేత చిన్న పాత్ర పోషింపజేశారు.

దుష్ట పాత్రల్లో జీవించి…

‘కనకదుర్గ పూజా మహిమ’ సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్‌ వచ్చినా 1962లో సత్యనారాయణకు మంచి అవకాశాలు వచ్చాయి. శ్యాం ప్రసాద్‌ మూవీస్‌ వారు వై.ఆర్‌.స్వామి దర్శకత్వంలో నిర్మించిన ‘స్వర్ణగౌరి’లో శివుడి పాత్ర సత్యనారాయణను వరించింది. తర్వాత ‘మదనకామరాజు కథ’లో ధర్మపాలుడుగా, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో కర్ణుడిగా, సి.పుల్లయ్య సారధ్యంలో వచ్చిన సంచలన పౌరాణిక రంగుల చిత్రం ‘లవకుశ’లో భరతునిగా, నర్తనశాలలో దుశ్శాసనునిగా, మనాపురం అప్పారావు నిర్మించిన ‘పరువు ప్రతిష్ట’లో ప్రతినాయకునిగా నటించారు. విఠలాచార్య సినిమా ‘అగ్గిపిడుగు’లో రాజనాల ఆంతరంగికునిగా, ‘జిస్‌ దేశ్‌ మే గంగా బెహతీ హై’లోని ప్రాణ్‌ గెటప్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ‘శ్రీకృష్ట పాండవీయం’, ‘పాండవవనవాసం’లో ఘటోత్కచునిగా, ‘శ్రీకృష్ణావతారం’, ‘కురుక్షేత్రం’లో సుయోధనుడిగా, ‘దానవీరశూరకర్ణ’లో భీమునిగా, ‘చాణక్య చంద్రగుప్త’లో రాక్షస మంత్రిగా, ‘సీతాకల్యాణం’లో రావణాసురునిగా, అసమాన నటనను ప్రదర్శించారు. ఇక సత్యనారాయణ వెనుకకు తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ‘కథానాయిక మొల్ల’లో శ్రీకృష్ణదేవరాయలుగా నటించి మెప్పించారు. ‘ఉమ్మడికుటుంబం’ సినిమాలో ఎన్టీఆర్‌కు జాలిగొలిపే అన్నగా, ‘వరకట్నం’లో కృష్ణకుమారి సోదరునిగా అద్భుతనటన ప్రదర్శించారు. ‘శారద’ సినిమాతో సత్యనారాయణ మంచి కేరక్టర్‌ నటునిగా గుర్తింపు పొందారు. ‘ప్రేమనగర్‌’లో కేశవవర్మ పాత్రలో సత్యనారాయణ జీవించారు. ‘అడవిరాముడు’, ‘వేటగాడు’ సినిమాల్లో విభిన్నమైన విలన్‌ పాత్రలు పోషించి అద్భుతంగా మెప్పించారు.

కేరక్టర్‌ నటునిగా.. నిర్మాతగా

యస్‌.వి.రంగారావు మరణానంతరం ఆయన పోషించాల్సిన గంభీర పాత్రలు ఎక్కువగా సత్యనారాయణనే వరించాయి. దాంతో కేరక్టర్‌ నటునిగా తనని తాను మలుచుకునే అవకాశం సత్యనారాయణకు దక్కింది. ‘గూండా’, ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘సమరసింహారెడ్డి’ వంటి సినిమాల్లో బాధ్యాతాయుతమైన పోలీసు అధికారిగా నటించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. రామానాయుడు సినిమా ‘సావాసగాళ్లు’లో గుమ్మడితో కలిసి ఒక గ్రూప్‌ డ్యాన్స్‌ పాటలో సత్యనారాయణ నర్తించాల్సి వచ్చింది. నృత్యదర్శకుడు హీరాలాల్‌ వీళ్లిద్దరూ స్టెప్పులు ఎలా వెయ్యాలో వివరించారు. మంగళగిరిలో అవుట్‌డోర్‌లో చిత్రీకరణ రంగం సిద్ధమైంది. జయచిత్రకు సత్యనారాయణ స్టెప్పులు వేయడానికి పడుతున్న ఇబ్బంది అర్థమైంది. ఆ స్టెప్పులు వెయ్యాల్సిన విధానం నెమ్మదిగా వివరించింది. ఇంకేముంది సత్యనారాయణ, గుమ్మడి విజృంభించి నాట్యం చేసి ఒకే షాట్లో ఆ సన్నివేశాన్ని ఓకే చేయించేశారు. ‘తాత మనవడు’, ‘చదువు సంస్కారం’, ‘తూర్పుపడమర’, ‘నేరము శిక్ష’, ‘సిరిసిరిమువ్వ’, ‘బంగారు కుటుంబం’, ‘అన్వేషణ’, ‘తాతయ్య ప్రేమలీలలు’, ‘బొబ్బిలిరాజా’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘శ్రుతిలయలు’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘రుద్రవీణ’, ‘అల్లుడుగారు’, ‘ఒంటరిపోరాటం’ వంటి సాంఘిక చిత్రాల్లో సత్యనారాయణ విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు, సోషల్‌ ఫాంటసీ చిత్రాలు ‘యమగోల’, ‘యమలీల’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాల్లో యముడిగా జీవించారు. వృత్తిమీద సత్యనారాయణకున్న అంకిత భావమే ఆయనను నిర్మాతగా మార్చింది. ‘దరువు’ సినిమాలో చివరిసారిగా కనిపించారు. రమా ఫిలిమ్స్‌ పేరిట చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి, ‘గజదొంగ’, ‘ఇద్దరు దొంగలు’, ‘కొదమ సింహం’, ‘బంగారు కటుంబం’, ‘ముద్దుల మొగుడు’, వంటి ఎనిమిది ప్రయోజనకరమైన చిత్రాలు తీసి విజయం సాధించారు. కొన్ని చిరంజీవి సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు.

పురస్కారాలు.. సత్కారాలు

సత్యనారాయణ నటించిన 800 పైచిలుకు చిత్రాల్లో 223 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. దాదాపు 200 మంది దర్శకులతో సత్యనారాయణ కలిసి పనిచేశారు. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో వైవిధ్య భరితమైన నటన ప్రదర్శించినందుకు సత్యనారాయణకు అనంతపురం, గుడివాడ పట్టణాలలో ‘నటశేఖర’ బిరుదు ప్రదానం చేశారు. కావలి విశ్వోదయ సాంస్కృతిక సంస్థ వారు ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించారు. ఇక ‘నవరస నటనా సార్వభౌమ’ బిరుదు సార్వజనీనకంగా అమరినదే. ‘తాత మనవడు’, ‘సంసారం సాగరం’, ‘కచదేవయాని’ సినిమాలకు ఉత్తమ నటునిగా నంది బహుమతులను అందుకున్నారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలం సత్యనారాయణకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి గౌరవించింది. తెలుగుదేశం పార్టీ తరపున మచిలీపట్నం పార్లమెంటు సభ్యునిగా కైకాల సత్యనారాయణ వ్యవహరించారు. సొంతవూరు కౌతవరంలో తన తాతగారి పేరుతో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని సత్యనారాయణ కట్టించారు. అలాగే గుడివాడలో ఒక కళామంటపం నిర్మించారు. పేద విద్యార్థులకు చదువుతోబాటు పెళ్లిళ్లు, ఉపాధి అందిస్తున్నారు. సామాజిక సేవలో తరిస్తున్న విశ్రాంత నవరస నటనాసార్వభౌమునికి నిండు నూరేళ్ల ఆయుషు ఆ భగవంతుడు ఇవ్వాలని సితార కోరుకుంటోంది.

సత్యనారాయాణ అభిప్రాయాలు..

* ‘‘నేను, ఎన్టీఆర్‌ అన్నయ్య (ఎన్టీఆర్‌) ఒకే ఫ్రేములో ఉంటే ఒక సింహం, ఒక ఏనుగు డీకొన్నట్లు ఉండేది. నన్ను ‘నంబర్‌ వన్‌ విలన్‌వి’ అని అన్నగారు మెచ్చుకునేవారు. ఉమ్మడి కుటుంబం సినిమాలో నాకు మంచి సెంటిమెంట్‌ పండించే రైతు పాత్రను ఇస్తే, విలన్‌గా చేసేవాడికి సెంటిమెంట్‌ క్యారక్టరా అన్నవాళ్లు ఉన్నారు. ఆ పాత్ర ప్రేక్షకులచేత కన్నీరు పెట్టించింది. ఆ సినిమా తర్వాత ‘జీవితంలో మాకు మీలాంటి అన్నయ్య లేడనే కొరతగా ఉందండీ’ అంటూ ఉత్తరాలు వచ్చాయి. ‘శారద’ సినిమా నా జీవిత గమనాన్నే మార్చేసింది’’
* ‘‘దర్శకనిర్మాత సుభాష్‌ ఘాయ్‌ నన్ను ‘కర్మ’ సినిమాలో పరిచయం చేసినప్పుడు నా నటనకు ముగ్దుడై ‘నీలో ఒక అశోక్‌కుమార్‌, సంజీవ్‌ కుమార్‌, శివాజి గణేశన్లు ముగ్గురూ ఉన్నారు’ అని ప్రశంసించారు’’

* ‘‘సూర్యకాంతం అక్కయ్య సెట్లోకి తెచ్చే బొబ్బట్లు, పులిహోర, నిర్మలమ్మ వడ్డించే కోడిగుడ్లు, ఉవలచారు, కోడిమాంసం జీవితంలో మరచిపోలేను. చెట్లనీడల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్లం’’

* ‘‘మా రోజుల్లో సినిమా నిర్మాణం పూర్తయ్యాక పరిశ్రమలో ఉన్న దర్శకుల్ని, నిర్మాతల్ని, నటీనటుల్ని పిలిచి ప్రీవ్యూ వేసేవారు. అభిప్రాయాలు తెలుసుకునేవారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. ఇప్పుడొస్తున్న సినిమాల్లో పాటలు ‘హాల్‌ టైం గ్రేట్స్‌’. హాలు బయటకు వచ్చాక గుర్తుండవు. సినిమాల్లో హింస అనే అంశానికి ప్రాధాన్యత పెరుగుతోంది..కథకు తగ్గుతోంది’’

సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది విఠలాచార్య. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనక దుర్గ పూజా మహిమ లో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో ఆయన ప్రతి నా యకుడుగా స్థిరపడి పోయాడు.

ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ కారెక్టర్ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయన్ని సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ లాంటి ఒక విలక్షణ నటుడు దొరకటం ఒక వరం. ఈయన వెయ్యని పాత్ర అంటూ లేదు. ఆయన ఏపాత్ర వేసినా ఆ పాత్రలో జీవించాడు. ఆయన యమగోల మరియు యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. కృష్ణుడిగా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా! ఎస్.వి.రంగారావు ధరించిన పాత్రలు చాలావరకు సత్యనారాయణ పోషించారు.పౌరాణికాల్లో రావణుడు,దుర్యోధనుడు,యముడు,ఘటోద్గచుడు సాంఘికాల్లో రౌడీ,కథానాయకుని (కథాకనాయిక) తండ్రి,తాత మొదలైనవి.

సత్యనారాయణ. నిలువెత్తు విగ్రహంతో యన్‌.టి.రామరావు కృష్ణుడైతే, సత్యనారాయణే సుయోధనుడు. రామారావు రాముడైతే, సత్యనారాయణ రావణాసురుడు. విఠలాచార్య ప్రోత్సాహంతో ప్రతినాయకునిగా రాణించిన అనుభవశాలి. ‘నాపేరే భగవాన్‌’లో ప్రాణ్‌ను మరపించిన నటనతో, ‘శారద’లో చెల్లెలి కోసం ప్రాణం విడిచేందుకైనా వెరవని అన్నగా, ‘తాత మనవడు’లో నిర్దయుడైన తనయునిగా, ‘యమగోల’లో ‘‘యముండ’’ అనే ట్రేడ్‌ మార్క్‌ డైలాగుతో దయామయుడైన శిక్షకునిగా, ‘వేటగాడు’లో అమాయక చక్రవర్తిగా, ‘సావాసగాళ్లు’లో ఉంగరాల సాంబయ్యగా, ‘సూత్రధారులు’లో సంగీతానికి జీవితాన్నే వెచ్చించిన కళాకారునిగా, ‘సిరిసిరిమువ్వ’లో వికలాంగుడైన చేతగాని తండ్రిగా, ‘గురువును మించిన శిష్యుడు’లో ధర్మపాలునిగా వైవిధ్య నటనకు ఊపిరులూదిన ఈ సార్వభౌముడు ఎనభై రెండేళ్ల వయసుని, ఎనిమిది వందల సినిమాలతో అరవై ఏళ్ల నటనానుభవాన్ని, అన్నిటినీ మించి అసాధారణ జీవితసారాన్ని ఆపోసన పట్టిన మహామేధావి.

వారి అడుగులు శతాబ్ది వైపు పయనయమయ్యాలి అని, నిండు నూరేళ్ళు ఆయు ఆర్యోగాలతో జీవించాలి అని కోరుకొంటూ….

ఇట్లు,
కరోతు సురేష్