దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరిగింది: గోపీచంద్‌

వాస్తవం ప్రతినిధి: అంతర్జాతీయ వేదికలపై పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ సాధించిన విజయాల వల్ల దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ విశేషంగా పెరిగిందని జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు. దేశంలో బ్యాడ్మింటన్‌ భవిష్యత్తు ఎంతో ప్రజ్వలంగా ఉంటుందని ఆదివారం ఓ వెబినార్‌లో పేర్కొన్నాడు. ‘గత పదేండ్లలో దేశంలో బ్యాడ్మింటన్‌ విశేషంగా అభివృద్ధి చెందింది. నేను కోచింగ్‌ కెరీర్‌ ప్రారంభించినప్పుడు హైదరాబాద్‌లో కేవలం 10 మంచి కోర్టులు ఉండేవి. ఇప్పుడు వెయ్యికి పైగా ఉన్నాయి అని గోపీచంద్‌ చెప్పాడు.