నా కోసం యాత్ర రద్దు చేసుకున్న ధోనీ: గ్యారీ కిర్​స్టన్

వాస్తవం ప్రతినిధి: తాను టీమ్​ఇండియా హెడ్​కోచ్​గా ఉన్న సమయంలో కెప్టెన్​గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ తన పట్ల ఎంతో విధేయతగా ఉండేవాడని గ్యారీ కిర్​స్టన్ వెల్లడించాడు. తన కెరీర్​లో కలిసిన అత్యుత్తమ వ్యక్తిత్వమున్న వ్యక్తుల్లో ధోనీ ఒకడని ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో అన్నాడు.2011 ప్రపంచకప్ ముందు జరిగిన ఓ ఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. బెంగళూరులోని ఎయిర్​స్కూల్​ యాత్రకు జట్టు మొత్తం వెళ్లాల్సి ఉంది. బృందంలో నేను, ప్యాడీ ఆప్టన్, ఎరిక్ సిమన్స్​ ముగ్గురం దక్షిణాఫ్రికాకు చెందినవాళ్లం. దీంతో భద్రతా కారణాల వల్ల ఎయిర్​ స్కూల్​లోకి మమ్మల్ని అనుమతించలేదు. దీంతో మొత్తం కార్యక్రమాన్ని ధోనీ రద్దు చేశాడు. ‘వీరు మా మనుషులు, ఒకవేళ వాళ్లని అనుతించకపోతే, మేం కూడా ఎవరం వెళ్లం’ అని ధోనీ అన్నాడు. అదీ అతడి విధేయత, వ్యక్తిత్వం” అని కిర్​స్టన్ చెప్పాడు.