మహీ నా ఫేవరెట్ బ్యాటింగ్ పార్ట్‌నర్: రిషభ్ పంత్

వాస్తవం ప్రతినిధి: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఫేవరెట్ బ్యాటింగ్ పార్ట్‌నర్ అని యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చెప్పాడు. మహీ పార్ట్‌నర్‌‌గాఉన్నప్పుడు అతడి సూచలనలను పాటిస్తే సరిపోతుందని, ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉండదన్నాడు. ‘నాకు చాలా ఇష్టమైన బ్యాటింగ్ పార్ట్‌నర్ ధోని. కానీ మహీతో కలసి బ్యాటింగ్ చేసే చాన్స్ ఎప్పుడో కానీ రాదు. అతడు నాతోపాటు క్రీజులో ఉంటే ప్రతిదీ సులువుగా అనిపిస్తుంది. అతడు ప్లాన్స్‌ వేస్తాడు. మనం వాటిని అనుసరిస్తే సరిసోతుంది. లక్ష్యాలు ఛేదించే టైమ్‌లో అతడి మైండ్ అద్భుతంగా పని చేస్తుందని పంత్ వివరించాడు.